back

దేవుడే అల్లు అర్జున్ ని పంపించాడు - పోసాని



Share via:

పోసాని కృష్ణమురళి ఒకప్పుడు రచయితగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి తర్వాత ఒక విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పరిశ్రమ పైన గట్టిగానే తన ముద్ర వేసాడు. రాంచరణ్ సినిమా 'నాయక్' లో చేసిన కమెడియన్ పాత్రతో బిజీ అయిపోయిన పోసాని అప్పుడప్పుడు తన గొంతుకి పని చెప్తుంటాడు. అలాగే తన మంచి మనసుని కూడా ఆచరణ లో చూపిస్తుంటాడు. ఈ మధ్యనే ముగ్గురు అమ్మాయిలు రశ్మిత, రాజేశ్వరి, శాకీనాబి లు 10 వ తరగతి ప్రభుత్వ పాటశాలలో చదివి 9.5 జిపిఏ తో పాస్ అయ్యారు. వారు పై చదువులు చదవడానికి ఆర్ధిక సాయం కోసం చూస్తున్న తరుణం లో పోసాని వాళ్ళకి 1.5 లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళ చదువు భాద్యత తీసుకున్నారు.

ఓవర్సీస్ లో కష్టపడుతున్న అల్లు అర్జున్

అయితే తను చేసిన సాయం వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడని బయట పెట్టి అందరిలో ఈ విషయం పైన ఆసక్తి కలిగించారు. “తనని కొంత కాలం క్రితం అల్లు అర్జున్ పిలిపించారని, తను అక్కడికి వెళ్ళగా ఆయన నా చేతిలో 5 లక్షలు పెట్టి అభిమానంతో ఇస్తున్నాను కాదనకండి అన్నారు. నాకు అర్థం అవ్వలేదు ఎందుకు ఇస్తున్నాడు అని కాని వద్ధనలేక తీసుకున్న, తర్వాత అర్థమైంది దేవుడే బన్నీ రూపం లో ఆ డబ్బులు నాకు అందచేసి ఆ డబ్బు తో ఈ ముగ్గురు ఆడ పిల్లల జీవితాలకి దారి చూపించాడు” అని పోసాని కృష్ణమురళి తెలిపారు.

Tags : Allu Arjun, Posani Krishnamurali

Write a comment ...
Post comment
Cancel