back

విజయ్ దేవరకొండ కోసం వస్తున్న బన్నీ..



Share via:

తెలుగు రాష్ట్రాల్లోని యువతలో తక్కువ కాలంలోనే తన సినిమాలు మరియు ప్రవర్తనతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా “టాక్సివాలా” ఈ నెల 22న రిలీజ్ అవ్వనుంది. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంయుక్త నిర్మాణంలో రాహుల్ సంక్రుత్యాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రానున్నాడు. నవంబర్ 11న ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగనుంది. ఇక అల్లు అర్జున్ ఇంతకు ముందు విజయ్ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక కు ముఖ్య అతిధిగా రాగా ఆ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది. మరి ఈ టాక్సీవాలా కు కూడా ఆ సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందో లేదో చూడాలి. ఎంతైనా బన్నీ గీతాఆర్ట్స్ నోర్మాన బాగస్వామ్యంలో ఉన్న సినిమాలకే కాక వేరే సినిమాల వేడుకలకు కూడా వస్తే అభిమానులకి ఆనందంగా ఉంటుంది.

Tags : Allu Arjun, Vijay Deverakonda, Taxiwaala Pre Release Event

Write a comment ...
Post comment
Cancel