back

సూపర్ హిట్లు కొట్టిన తమిళ దర్శకుడు... బన్నీతో సినిమాకి సిద్దం!



Share via:

యువ తమిళ దర్శకుడు అట్లీ కన్ను ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై పడింది. అక్కడి యువ దర్శకులు కొత్త కొత్త కథలతో సినిమాలు తీస్తుంటే… అట్లీ తెలుగు దర్శకుల తరహాలో కమర్షియల్ ఫార్మటులో సినిమాలు తీస్తున్న కొత్త తరం యంగ్ డైరెక్టర్.

అట్లీ తన మొదటి సినిమా రాజా రాణి తోనే తన వైవిధ్యాన్ని చూపించిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి రెండు చోట్ల మంచి విజయం సాదించింది. ఇక తమిళ స్టార్ విజయ్ పోలీసోడు గా విడుదలైన ‘తెరి’, ‘అదిరింది’గా వచ్చిన ‘మెర్సల్’ సినిమాలు కమర్షియల్ హిట్ సినిమాలే.

అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే ఈ యువ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడని సమాచారం. “నా తదుపరి సినిమా తెలుగులో వుంటుంది. ప్రముఖ తెలుగు హీరో అందులో నటిస్తారు. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి కొన్ని రోజులు వెయిట్ చేయండి” అని అట్లీ పేర్కొన్నారు. అయితే అతడు డిస్కషన్ చేస్తున్నది అల్లు అర్జున్‌తోనే అని ఫిలిం నగర్ టాక్...

మొన్నతమిళ దర్శకుడు లింగుస్వామి చాలారోజులు బన్నీతో సినిమా గురించి డిస్కస్ చేశాడు. చెన్నైలో సినిమా ఓపెనింగ్ జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీయాలనుకున్నారు. కానీ, ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. అట్లీ అయినా బన్నీ దగ్గర సినిమాను ఒకే చేయించుకుంటాడో? లేదో వేచి చూడాలి.

Tags : Allu Arjun With Atlee, Allu Arjun Next Film, Allu Arjun New Film, Allu Arjun Film With Tamil Director

Write a comment ...
Post comment
Cancel