back

అల్లు అర్జున్ కి నచ్చిన పాట



Share via:

ప్రతి ఒక్కరికి తమ జీవితంలో కొన్ని పాటలంటే బాగా ఇష్టం ఉంటుంది.అందులో కొన్ని వారిని తమ జీవితాంతం వెంటాడుతాయి. అలాగే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఊక పాటంటే బాగా ఇష్టం. 23 ఏళ్ల తర్వాత కూడా ఆ మ్యూజిక్ లో అదే మేజిక్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లో
"తుఝే దేఖాతో ఏ జానా సనమ్.. నేను 1995లో  ఆ పాటను చూసినప్పుడు అదో అద్భుతంలా అనిపించింది.. మళ్ళీ 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తే .. నా హృదయంలో అదే మ్యాజిక్.. దాని పై అదే రకమైన ప్రేమ. నా లైఫ్ లో ఇదో బెస్ట్ సినిమాటిక్ మూమెంట్,ఇప్పుడు.. ఎప్పటికీ."

షారూఖ్ ఖాన్ - కాజోల్ జంటగా నటించిన లవ్ స్టొరీ 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' అప్పట్లో బ్లాక్ బస్టర్ లకే బ్లాక్ బస్టర్.  ఆ సినిమాలో పాటలన్నీ చార్ట్ బస్టర్లే గానీ 'తుఝే దేఖాతో ఏ జానా సనమ్' పాట అప్పట్లో దేశవ్యాప్తంగా యువతరాన్ని ఒక ఊపు ఊపింది. ఈ పాట ఒక తరం మొత్తాన్ని అప్పట్లో ప్రభావితం చేసింది, అందుకే అల్లు అర్జున్ దాని గురించి చెప్పడంలో అతిశయోక్తి ఏమి లేదు.

Tags : Allu Arjun, Favorite Song, Tujhe Dekhatho Ye Jaana Sanam

Write a comment ...
Post comment
Cancel