back

బన్నీ అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే!



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న బన్నీ తదుపరి చిత్రం గురించి మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఈ విషయాన్ని అల్లు అర్జున్ అధికారికంగా వెల్లడించాడు. తన అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బన్నీ తన తదుపరి చిత్రం వివరాలు మరి కొన్ని రోజుల్లో వెల్లడిస్తానని అప్పటివరకు అభిమానులు ఇంకాస్త ఓపికతో వేచి చూడాలి అని కోరాడు.

రెండు రోజుల క్రితం బన్నీ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయ్యబోతున్నాడని ఆ సినీ విశేషాలను త్రివిక్రమ్ బర్త్ డే అయిన దీపావళి నవంబర్ 7వ తేదీన అనౌన్స్ చేయ్యబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనితో అల్లు అర్జున్ అభిమానులు అనౌన్స్ మెంట్ కోసం వేచి చూసారు. చివరగా బన్నీ ఇంకొంత కాలం వేచి చూడాలి అని కోరడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడిపోయారు.

Tags : Allu Arjun, Bunny Fans

Write a comment ...
Post comment
Cancel