back

తిత్లి బాదితులకు 25 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్



Share via:

మన దగ్గరలో ఏ విపత్తులు వచ్చిన అందరికంటే ముందు తెలుగు సినీ రంగం తన ఆపన్న హస్తాన్ని అందిస్తుంది. అందులో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుండి ఆర్థికంగా తన సహాయాన్ని అందిస్తాడు అని తెలిసిందే.

రెండు రోజుల క్రితం బన్నీ తిత్లి తుఫాను బాదితుల సహాయార్థం 25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా పేజి ద్వారా పోస్ట్ చేస్తూ...

మొన్న కేరళలో జరిగిన విపత్తుకి కూడా అల్లు అర్జున్ 25 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించాడు.

తిత్లి తుఫాను సృష్టించిన ప్రళయం ఆర్థికంగా అక్కడి ప్రజలను చాల కుంగదీసింది, కొన్ని గ్రామాలకు ఇప్పటికి విద్యుత్తు, ఆహార వసతులు లేక బిక్కు బిక్కుమంటు అంటూ సహాయం కోసం ఎదురుచూస్తూన్నారు.

మనము కూడా మనకి తోచిన సహాయం చేద్దాం.

Tags : Allu Arjun Donations, Titli Cyclone

Write a comment ...
Post comment
Cancel