back

మరోసారి తన మంచి మనసును చాటుకున్న అల్లు అర్జున్



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన దాతృత్వాన్ని, మంచి మనసును చాటుకున్నారు.

విషయమేమిటంటే...

కొద్ది రోజులుగా వరదలతో విలవిలలాడుతున్న కేరళ రాష్ట్రం సుమారు 5000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ వరదలలో ఇప్పటి వరకు 30మంది చనిపోగా ఎందరో నిరాశ్రులయ్యారు. ఈ వరదల ధాటికి సగం రాష్ట్రం చిక్కుకుపోయింది.

దీనికి సహాయంగా సినీ ప్రముఖులు తమకు తోచినంత విరాళాలను ఇస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ముందుండే మన బన్నీ కేరళ వరదల సహాయార్థం 25 లక్షలు ప్రకటించాడు.

కేరళలో అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫాలోయింగ్ మరియు ఫ్యాన్ బేస్ ఉంది. కేరళలో అల్లు అర్జున్ తనని తాను "మల్లు అర్జున్" గా కూడా ప్రకటించుకున్నాడు. బన్నీ ప్రతి చిత్రం తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదలవుతు ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న మన హీరో ఈ వరదల వళ్ళ నష్టపోయిన ప్రజలను చూసి చలించిపోయారు.

ఈ సందర్బంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ 25,00,000 విరాళం ప్రకటించారు.


Tags : Allu Arjun, Stylish Star, Kerala Flood Relief, Bunny

Write a comment ...
Post comment
Cancel