back

పవన్ రాజకీయం పై అల్లు అర్జున్ కామెంట్స్



Share via:

కొన్ని రోజుల క్రితం వరకు పవన్, అల్లు అర్జున్ అభిమానులకు అస్సలు పడేది కాదు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయి విమర్శలకు దిగిన సందర్భాలు కూడ చాలా ఉన్నాయి. `స‌రైనోడు` ఆడియో ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్‌ కళ్యాణ్ గురించి `చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌` అని ప‌వ‌ర్‌స్టార్‌ అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. అప్పట్నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్.. బ‌న్నీని సోష‌ల్ మీడియా ద్వారా ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. బ‌న్నీ సినిమాల ట్రైల‌ర్ల‌కు యూట్యూబ్ ద్వారా డిస్‌-లైక్‌లు కురిపించేసారు.

ఆ తర్వాత మొన్నటి శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ కు సపోర్టుగా నిలిచి పవన్ వెంట నడిచాడు అల్లు అర్జున్. అనంత‌రం బ‌న్నీ `నా పేరు సూర్య` సినిమా స‌క్సెస్ మీట్‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. దీంతో ప‌వ‌న్‌, బ‌న్నీ అభిమానులు మ‌ళ్లీ ఒక్క‌ట‌య్యారు. బన్నీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో పవన్ రాజకీయ ప్రస్థానం గురించి ఒక ఫోటో పైన ఆలోచించాల్సిన కామెంట్స్ చేశాడు. అవేంటంటే...
“మీ నిజమైన తత్వంతో మీరు బ్రతకండి.. ప్రపంచం దానికదే అడ్జెస్ట్ అవుతుంది’ దీని పైన మెగా అభిమానులంతా చాల పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Tags : Allu Arjun, Pawan Kalyan, Janasena Party

Write a comment ...
Post comment
Cancel