back

కొత్త ఆఫీసులో కొత్తగా బన్నీ ..



Share via:

గీతా ఆర్ట్స్ ఆఫీస్ నే తన ఆఫీస్ ఇప్పటివరకు వాడుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు తన సొంత ఆఫీస్ని ఓపెన్ చేసాడు. కొంత కాలం క్రితమే ఈ ఆఫీస్ కి సంబంధించి ఫొటోస్ బయటికి రాగా దాని గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ ఆఫీస్ తన సినిమా చర్చలు కుడా మొదులుపెట్టాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ ని కలవాలంటే జూబిలీహిల్స్ లోని ఈ కొత్త ఆఫీస్ కె రావాలని సినిమా వాళ్ళకి మరియు అభిమానులకు అధికారికంగా విషయం పాస్ చేసేసారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళకి మరో అసక్తికర వార్త అదేంటంటే ఇక మీదటే అల్లు అర్జున్ తన సొంత బ్యానర్ లో కొన్ని సినిమాలు నిర్మించాలని అనుకోవడమే. కొన్ని చిన్న సినిమాలు అలాగే ప్రయోగాత్మక సినిమాలు ఈ బ్యానర్ లో తీయాలని అందులో ఇదంతా పూర్తిగా తన సొంత వ్యాపకం కోసం చేయడం తో నష్టం అయిన లాభం అయిన తనకే ఉండాలని నిర్ణయించాదంటా.. ఎంతైనా గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ముగ్గురు కొడుకులకు వాటా ఉంటుంది కదా అందుకని ఇలా అల్లు అర్జున్ చేయడం కూడా కరెక్ట్ గానే ఉంది. మరి ఈ ప్రయత్నం లో కూడా బన్నీ సక్సెస్ కావాలని కోరుకుందాం .

Tags : Bunny, Allu Arjun, Geetha Arts

Write a comment ...
Post comment
Cancel