back

కొత్త సినిమా ప్రకటించిన అల్లు అర్జున్



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మంచి వార్త ఇచ్చాడు. కొద్ది నెలలుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. బన్నీ ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ నేడు(సోమవారం) 2018 ఎండింగ్ సందర్భంగా ఒక వార్త ఇచ్చేశాడు. బన్నీ 19వ చిత్రం మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ నిర్మించనున్నాయి. జనవరి, 2019లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.


హీరోగా అల్లు అర్జుణ్ కి ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్లో మూడవ చిత్రం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఈ చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్’ అధినేతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు),అల్లు అరవింద్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

 

ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తైంది. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా తెలియజేయనున్నారు

Tags : Allu Arjun, AA19

Write a comment ...
Post comment
Cancel