back

మెగా హీరోలంతా ఒకే వేదిక పైన ...!



Share via:

మెగా హీరోలంతా ఒకే వేదిక పైకి వస్తే చూడాలని అభిమానులు అంతా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్స్ లో ముగ్గురు అన్నదమ్ములు ఒకే వేదిక పైన చూసాము కాని ఇప్పుడు మెగా హీరోలు అంటే చాల మంది ఉన్నారు, ముఖ్యంగా రాంచరణ్, బన్నీ లు... ఇప్పుడు వీరంతా ఒక వేదికపైకి రావడానికి ముహూర్తం సెట్ అయింది, అదే రంగస్థలం సక్సెస్ మీట్..

ఈ సినిమా సక్సెస్ తో ఆనందంగా ఉన్న రాంచరణ్ సినిమా యూనిట్ తో కలిసి తమ ఆనందాన్ని మెగా అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించారు.. ఈ నెల 12వ తేదీన మెగా ఫాన్స్ కి ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వాలని చరణ్ అండ్ టీం డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ నే సక్సెస్ మీట్ గా మార్చి పెద్ద ఈవెంట్ చేయాలనీ రాంచరణ్ మరియు సినిమా నిర్మాతలు నిర్ణయించారు. ఇప్పటికే ఈ సినిమా పైన అన్ని వర్గాల నుంచి వస్తున్న అపూర్వ స్పందనకి మెగా ఫ్యామిలీ ఆనందం లో ఉంది, అందుకే ఈ ఆనందాన్ని అభిమానులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించారు.

మరిన్ని...

12 రోజుల తర్వాత యుఎస్ లో రంగస్థలం పరిస్థితి ..!
నైజాం లో రంగస్థలం 25 కోట్లు సాధిస్తుందా ..?

ఏ ఫంక్షన్ కి రాణి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు తానే ప్రకటించారు, ఇక చిరంజీవి , నాగబాబు లు కచ్చితంగా వస్తారు, ఈ మధ్యనే బన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం తను కూడా వస్తాడు, ఇక మిగతా వాళ్ళు చరణ్ కోసం ఎలా అయిన వస్తారు కనుక , ఎన్నాళ్ళో వేచిన అభిమానులకు ఇది పెద్ద పండగ అనే చెప్పాలి.

Tags : Rangasthalam Success Meet, Mega Heroes, MegaStar Chiranjeevi, Power Star Pawan Kalyan, Nagababu, Allu Arjun, Ram Charan, Sai Dharam Tej, Varun Tej, Rangasthalam Movie

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details