back

ఆచార్య ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ?Share via:

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఆచార్య సినిమా నుండి ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీరామ నవమికే ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది. మొత్తానికి నవమికి మెగా ట్రీట్ ఫిక్స్ అయింది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట.

మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారట. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లను కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.

Tags : Chiranjeevi, Chiru152, Megastar, Acharya, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel