back

యుఎస్ లో 3.5 మిలియన్స్ దాటేసిన రంగస్థలం



Share via:

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాకు యుఎస్ మార్కెట్ చాల పెద్ద ఆదాయ వనరుగా మారింది, దర్శకులు కూడా అక్కడి ప్రేక్షకులను ద్రుస్టి లో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు. కాని కొందఱు హీరోలకు మాత్రం అక్కడ హిట్ కొట్టడం అనేది అందని ద్రాక్షల మిగిలిపోయింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా అందుకు మినహాయింపు కాదు, ఎన్నో సినిమాల తరువాత ధృవ సినిమాతో యుఎస్ లో మొదటిసారి 1 మిలియన్ మార్కుని దాటిన రాంచరణ్ ఇప్పుడు రంగస్థలం సినిమాతో తన కరువుని తీర్చుకున్నాడు

5వ వారంలో కూడా యుఎస్ లో షేర్ సాధిస్తున్న రంగస్థలం బాహుబలి తరువాత 3.5 మిలియన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా రికార్డ్ని దాటడం అంతా సులభం కాదని అంటున్నారు ట్రేడ్ పండిట్లు. ఎందుకంటే యుఎస్ లో తన ఫ్లాప్ సినిమాలకు కూడా మంచి వసూళ్లు సాధించే మహేష్ బాబు భరత్ అనే నేను మూవీ కూడా రెండవ వారం నుంచి వసూళ్లు బాగా తగ్గిపోవడంతో 3 మిలియన్ లకు కొంచం ఎక్కువ లో ఆగిపోవచ్చు. ఇప్పటికే 200 కోట్లు గ్రాస్ మరియు 120 కోట్ల షేర్ సాధించిన రంగస్థలం రికార్డు ని ఏ సినిమా బీట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే తన సైరా సినిమాకి ఆ ఛాన్స్ ఉంది అంటూ చిరంజీవి అభిమానులతో అనేసారు. మరి సైరా వరకు ఆగాల లేక ముందే ఏదైనా సినిమా సాధిస్తుందా అనేది వేచి చూడాలి.

Tags : Ramcharan, Rangasthalam, US Boxoffoce, 3.5 millions

Write a comment ...
Post comment
Cancel