back

HBO లో అల్లు అర్జున్



Share via:

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మే 4న విడుదల అవ్వబోతోంది అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’. త్వరలో హిందీలోనూ డబ్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే తాజాగా హెచ్బీవో చానల్ లో వస్తున్న ప్రోమో వీడియాలో బన్నీ కనిపించడంతో అవాక్కవ్వడం తెలుగు ప్రేక్షకుల వంతయ్యింది. హోమ్ బాక్స్ ఆఫీస్ అంటూ హెచ్బీవో ఛానెల్ లో వచ్చే సినిమాల గురించి ప్రమోట్ చేస్తూ కనిపించాడు బన్నీ. ఒక తెలుగు హీరో ఆంగ్ల ఛానెల్ ను ప్రమోట్ చేయడమంటే విశేషమే. నిజానికి తన సినిమాని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు  సదరు ఇంగ్లీషు ఛానెల్ ని ఆశ్రయించాడు బన్నీ, అయితే ఆ ఛానెల్ మాత్రం బన్నీ క్రేజ్ ను ఛానెల్ ప్రమోషన్ కి వాడుకుంటోంది. ఇది బన్నీకి లాభమే. ఇంతవరకూ కేరళ- తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన బన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతాడు. సినిమాకీ కావల్సినంత పబ్లిసిటీ.

ఆ వీడియో అభిమానుల కోసం బన్నీ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు...క్రింద వీడియో చూడగలరు ..

Tags : Allu Arjun, Naa peru surya, HBO

Write a comment ...
Post comment
Cancel