back

చిరంజీవి - కొరటాల శివ సినిమాకి ముహూర్తం ఖరారు ..



Share via:

మొన్న వినయ విదేయ రామ సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక ప్రకటన చాలా సందేహాలు సృష్తించింది. త్రివిక్రమ్ తను సినిమా చేయబోతున్నట్లు చిరు ప్రకటించగానే కొరటాల సినిమా కాన్సిల్ అయిందని ఇండస్ట్రీ బాగా ప్రచారం వచ్చింది. దాంతో జాగ్రత పడిన కొణిదెల ప్రొడక్షన్స్ వెంటనే తమతో టచ్ లో ఉండే మీడియా మిత్రులకు ఒక వార్త చేరవేసింది. దాని సారాంశం ఏంటంటే ..


“సైరా సినిమా పనులు అన్ని సమ్మర్ కంతా పూర్తి చేసుకుని, సమ్మర్ నుంచి కొరటాల శివతో మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు మెగాస్టార్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథ కథనాల్ని కూడా శివ పూర్తిచేశాడు. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత మెగాస్టార్ మూవీకి షిఫ్ట్ అవుతాడు. ఈ లోపుగా కొరటాల శివ తో చిరంజీవి సినిమాను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు.”

అయితే ఇక్కడే మనకి ఇంకో విషయం అర్థమవుతుంది అదే సైరా రిలీజ్ ఎప్పుడు అనేది, ఈ వార్త ప్రకారం అయితే సైరా రిలీజ్ ని ఆగష్టు 15కి ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది.

Tags : Chiranjeevi, Syeraa, Koratala Siva

Write a comment ...
Post comment
Cancel