back

15 ఏళ్ల స్టైలిష్ స్టార్...



Share via:

.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న అగ్ర నటుడు , డాన్సులు, ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కు అల్లు అర్జున్ పర్యాయపదంగా మారిపోయాడు. అల్లు అర్జున్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే 15 ఏళ్ళు గడచిపోయింది అంటే నమ్మలేకుంది.తన చిన్నతనం లో చిరంజీవి గారి విజేత సినిమాలో కనిపించాడు, తర్వాత మళ్ళి చిరంజీవి గారి డాడీ సినిమాలో 2001లో ప్రత్యెక పాత్రా చేసాడు..

.

ఇక పూర్తి స్థాయిలో 2003 మార్చి 28 న అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి విడుదలయింది. ఈ చిత్రం మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్నర్ గా అలరించింది. ఆ చిత్ర జ్ఞాపకాలని బన్నీ గుర్తు చేసుకున్నాడు. ఈ పదిహేను సంవత్సరాలలో నటుడిగా బన్నీ బాగా రాటుదేలాడు. మెగా మేనల్లుడిగా అడుగుపెట్టినా, తన ప్రతిభతో అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించడమే కాక మెల్లి మెల్లిగ తన స్టార్డమ్ పెంచుకుంట్టు ముందుకు వెళ్తున్నాడు. అంతే కాకుండా కేరళలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న మొదటి తెలుగు హీరో బన్నీనే కావడం విశేషం..

.

అలాగే ఇప్పుడు నేషనల్ స్థాయిలో కూడా బన్నీ తన పరిచయాన్నిగట్టిగానే చేసుకున్నాడు అనే చెప్పాలి తను నటించిన..సరైనోడు , DJ సినిమాలు బాలీవుడ్ లో డబ్ అయి కొత్త సంచలనాలకు తెర లేపాయి. అత్యధిక వ్యూస్ కల్గిన సినిమాలుగా యుట్యూబ్ లో రికార్డ్స్ క్రీయాట్ చేసాయి. అలాగ నేషనల్ స్థాయి హీరోగ కూడా మారిపోయాడు బన్ని..

.

అల్లు అర్జున్ సినీరంగప్రవేశం చేసి 15 ఏళ్ళు గడచిపోయాయిన సందర్బంగా, తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మొదట్లో గంగోత్రి, ఆర్య వంటి ప్రేమ కథ చిత్రాలు చేసిన బన్నీ నెమ్మదిగా కమర్షియల్ హీరోగా ఎదిగి స్టైలిష్ స్టార్ గా మారాడు. అల్లు అర్జున్ నటించిన చిత్రాలు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్నాయి..

.

ఇప్పుడు తన మార్కెట్ వాల్యూ 80 కోట్లుగ వుంది...ఇంకా ముందు ముందు ఇంకా పెరుగుతుంది అని నమ్ముతు..

.

తను మరిన్ని మంచి సినిమాలు తీసి మరో 25 ఏళ్ళు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మనల్ని అలరిస్తూ ఉండాలని ఆశిద్దాం..

Tags : allu arjun, stylish star,allu arjun 15 years in industry,bunny,naa peru surya ,sarinodu ,dj

Write a comment ...
Post comment
Cancel