సాయి ధరం తేజ్ బయోగ్రఫీ

సాయి ధరమ్ తేజ్ ఒక భారతీయ నటుడు. తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన తేజు, ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవికి స్వయానా మేనల్లుడు. విజయ దుర్గ మరియు శివ ప్రసాద్ కు 1986 అక్టోబర్ 15న జన్మించిన తేజు, 2013 లో వై వీ ఎస్ చౌదరి దర్శకత్వం లో రేయ్ అనే చిత్రం తో నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు కానీ దాని తరువాత చేసిన పిల్ల నువ్వు లేని జీవితం అనే చిత్రం ముందుగ 2014 లో విడుదలైంది. 2015 లో విడుదలైన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం తో ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలు పొందాడు. 2016 లో విడుదలైన సుప్రీమ్ చిత్రం తో విజయం సాధించి సుప్రీమ్ హీరో అనే టైటిల్ పొందాడు. ప్రస్తుతం తేజు వి వి వినాయక్ మరియు కరుణాకరన్ దర్శకత్వం లో నటిస్తున్నాడు.

Source: wikipediaTags : Sai Dharam Tej BiographySend Your Fan moments, Events, Association Details


Other Biographies