రామ్ చరణ్ బయోగ్రఫీ

కొణిదెల రామ్ చరణ్ తేజ ప్రముఖ సినీ నటుడూ, రాజకీయ నాయకుడు చిరంజీవికి రెండొవ సంతానం. రామ్ చరణ్ ఒక నటుడు, నిర్మాత మరియు వ్యాపారవేత్త. చరణ్ 1985 మార్చ్ 27న చెన్నై లో చిరంజీవి, సురేఖ కు జన్మించాడు.

నటుడిగా

2007 లో పూరి జగన్నాథ్ దర్శకత్వం లో చరణ్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ చిత్రానికిగాను చరణ్ ఫిలింఫేర్ నూతన ఉత్తమ నటుడు అవార్డు మరియు స్పెషల్ జ్యురి నంది అవార్డులు అందుకున్నాడు.

2009 లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో మగధీర చిత్రం లో నటించాడు. తెలుగు సినిమా చరిత్ర లోనే అత్యంత వసూళ్లు చేసిన చిత్రం గ మగధీర నిలిచిపోయింది. ఈ చిత్రం కి 6 ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. రామ్ చరణ్ కు కూడా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ మరియు స్పెషల్ జ్యురి నంది అవార్డులు లభించాయి. ప్రేక్షకుల్లో చరణ్ క్రేజ్ కూడా పెంచింది ఈ చిత్రం.

2010 లో భాస్కర్ దర్శకత్వంలో నటించిన ఆరంజ్ చిత్రం ఊహించినంత ఫలితం రాణించలేదు. తరువాత రచ్చ, నాయక్ వంటి కమర్షియల్ సినిమాల్లో నటించి మెప్పించాడు.

2013 లో అమితాబ్ బచ్చన్ జంజీర్ ను హిందీ లో రీమేక్ చేస్తూ బాలీవుడ్ కి పరిచయమయ్యాడు దాన్నే తూఫాన్ గా తెలుగు లో అనువదించారు. ఈ చిత్రం అంతగా ఆడలేదు. తరువాత ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రుసెలీ వంటి సినిమాలు తీసి ఆకట్టుకున్నాడు.

వివాహం

జూన్ 14, 2012 లో చరణ్, అపోలో సంస్థ ఛైర్మెన్ సి. ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనా కామినేని ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

వ్యాపారవేత్తగా

2016 లో చరణ్, సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ స్థాపించి తండ్రి చిరంజీవి తో 150 వ చిరం నిర్మించారు.

2015 లో ట్రూజెట్ ఎయిర్ లైన్ అనే విమానయాన సంస్థను స్థాపించి అతి తక్కువ ధరలకే దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చాడు.

చరణ్, రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ కు యజమాని.

చరణ్., ప్రముఖ టీవీ ఛానల్ మా టీవీ బోర్డులు సభ్యుల్లో ఒకడు.

Source: wikipediaTags : Ram Charan, Ram Charan Biography, Ram Charan Businesses, Ram Charan MarriageOther Biographies