పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ప్రసిద్ధిగాంచిన కొణిదెల కళ్యాణ్ బాబు ఒక భారతీయ నటుడు,నిర్మాత,గేయకుడు మరియు రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్, ప్రముఖ నటుడూ, రాజకీయ నాయకుడు అయినా చిరంజీవికి చిన్న తమ్ముడు. కళ్యాణ్ సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల లో కొణిదెల వెంకట్ రావు, అంజనా దేవిలకు జన్మించాడు.

వైవాహిక జీవితం

1997 లో పవన్ కళ్యాణ్, నందిని ని వివాహం చేసుకుని 2007 లో విడిపోయారు. బద్రి సినిమా తో పరిచయం అయినా రేణు దేశాయ్ ను 2009 లో వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం కూతురు ఆద్య కొడుకు అఖీరా నందన్. 2012 లో రేణు దేశాయ్ తో విడిపోయి కొంతకాలం తరువాత 2013 లో అన్నా లేజ్నేవ అనే రష్యన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం కూతురు పోలేని. కొడుకు మార్క్ శంకర్ పావనోవిచ్.

నటుడిగా

1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రం తో తెరంగేట్రం చేసారు కళ్యాణ్. 1998 లో తాను నటించిన తొలి ప్రేమ చిత్రానికి ఉత్తమ చిత్రం గ జాతీయ పురస్కారం దక్కింది అంతే కాకుండా కళ్యాణ్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.

2001 లో విడుదలైన ఖుషి చిత్రం సుమారు 80 సెంటర్లలో 100 రోజులు ప్రదర్షింపబడింది. ఆ సంవత్సరపు అత్యంత జనరంజక చిత్రం గా నిలిచి పవన్ పాపులారిటీని ఆకాశమెత్తుకు పెంచింది. 2003 నుంచి 2011 వరకు పవన్ నటించిన జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం మరియు ఇతర చిత్రాలు ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన 2012 లో నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో పవన్ సత్తా ఏంటో నిరూపించింది.

2013 లో పవన్ నటించిన అత్తారిటింటికి దారేది చిత్రం విడుదలకు ముందే పైరసీ అయినా, సుమారు 73 కోట్ల రూపాయిలు సేకరించి ఆల్ టైం హిట్ గా నిలిచింది.

రాజకీయ వృత్తి

మార్చ్ 14, 2014 లో పవన్ కళ్యాణ్ జనసేన పత్తిని స్థాపించారు. ఇస్ం అనే పుస్తకం ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రకటించారు.

2014 జనరల్ ఎన్నికల్లో పవన్, బీ.జె.పీ మరియు తెలుగు దేశం పార్టీ కి విపరీతమైన ప్రచారం చేయగా ఆంధ్ర లో తెలుగు దేశం పార్టీ భారీ మెజారిటీ తో గెలిచింది.

తెలుగు రాష్ట్రాల విభజన పై పవన్ తన మనోవేదనను మోడీకి వివరించగా మోడీ " పవన్ మాటలు నా హృదయాన్ని కదిలించాయి, పవన్ లాంటి యువ నేతలు ఉంటె తెలుగు జాతికి అంతం ఉండదనీ, పవన్ ఆధ్వర్యం లో తెలంగాణ మరియు సీమాంధ్ర రాష్ట్రాలు వైభవంగా ఉంటాయని" అన్నారు. 2016 నవంబర్ లో, రానున్న ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు.

స్వచ్చంధ సేవలు

2012 లో పవన్, షూటర్ రేఖ చలిచేమ, ఒలంపిక్ క్రీడకు తోడ్పడుతూ 5 ఆంక్షలు అందించారు. 2013 లో ఉత్తరాఖండ్ సహజ విపత్తు నిర్వహణ నిధులు గా 20 లక్షలు, అక్టోబర్ 14 2014 లో హుదూద్ తుఫాను భాదీథులకు 50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

సినిమా పరిశ్రమలో అనేక నటులకు తన వంతు ఆర్ధిక సహాయం చేశారు. ఖమ్మం జిల్లాలో పాండురంగాపురం చర్చి కు లక్ష రూపాయిలు విరాళం గ ఇచ్చారు. గోట రోడ్డు ప్రమాదం లో తన రెండు కాళ్ళు పోగొట్టుకున్న గోట సతీష్ కు 5 లక్షలు విరాళంగా ఇచ్చి ఆదుకున్నారు.

Source: wikipediaTags : Pawan Kalyan, Pawan Kalyan Biography, Pawan Kalyan Marriage Details, Pawan Kalyan Donations, Pawan Kalyan Political DetailsOther Biographies