కొణిదెల నీహారిక బయోగ్రఫీ

కొణిదెల నీహారిక ఒక భారతీయ నటి, టీవీ యాంకర్. తెలుగు సినీ రంగంలో తన పాత్రలకు ప్రసిద్ధి. ప్రముఖ నటుడు నాగేంద్ర బాబు కూతురు, నటుడు వరుణ్ తేజ్ కు చెల్లి. ముద్ద పప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా నీహారిక ఈ టీవీ లో ప్రసారమయ్యే ఢీ- జూనియర్స్ అనే డాన్స్ షో కు యాంకర్ గా పనిచేసారు. 2016 లో విడుదలైన ఒక మనసు చిత్రం తో తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతి, ఓరు నల్ల నల్ల పాతు సోలారెన్ అనే తమిళ చిత్రం లో నటించనున్నారు.

Source: wikipediaTags : Niharika BiographyOther Biographies