చిరంజీవి బయోగ్రఫీ

చిరంజీవి గా ప్రసిద్ధి గాంచిన కొణిదెల శివ శంకర వార ప్రసాద్ ఒక భారతీయ నటుడు,నిర్మాత,గేయకుడు మరియు రాజకీయ నాయకుడు. చిరంజీవి ఆగష్టు 22 1955లో పశ్చిమ గోదావరి జిల్లా లోని నర్సాపూర్ దెగ్గర మొగల్తూరు గ్రామంలో జనమునాచారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ యొక్కరాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గా ఇండిపెండెంట్ చార్ఙ్గతో నియమితమయ్యారు. చిరంజీవి తెలుగు సినిమా మెగా స్టార్ గా ప్రసిద్ధి, అంతే కాకుండా తమిళ్, కన్నడ మరియు హిందీ సినిమాల్లో కూడా నటించారు.

నటుడిగా

1978 లో ప్రాణం ఖరీదు చిత్రం తో అరంగేట్రం చేశారు కానీ దాని తరువాత నటించిన పునాది రాళ్లు చిత్రం ముందు విడుదలయ్యింది. 1987 లో చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలో తర్జుమా చేసి మాస్కో అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రదర్శించారు. ఆ చిత్రానికి చిరంజీవికి మంచి పేరు మరియు ఎన్నో పురస్కారాలు తెచ్చిపెట్టాయి. ఆయన నటించిన రుద్రా వీణ వంటి చిత్రాలకు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.

1992 లో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం అప్పట్లోనే సుమారు 10 కోట్ల రూపాయిలు సేకరించింది. ఆ చిత్రం తో చిరజీవి కీర్తి ఇంకా పెరిగింది. ఫిలిం ఫేర్, ఇండియా టుడే వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు చిరంజీవిని "బిగ్గర్ థెన్ బచ్చన్" అంటూ పొగిడేసాయి. అదే సంవత్సరం లో విడుదలైన ఆపద్బాంధవుడు చిత్రానికి 1.2 కోట్ల పారితోషికం తీసుకుని దేశం లోనే అత్యంత ఖరీదైన నటుడయ్యాడు. 1999-2000 సంవత్సరానికి అత్యంత ఆదాయ పన్ను కట్టిన భారతీయుడిగా రంజీవికి, 2002 లో రాష్ట్ర ఆర్ధిక శాఖ, సమ్మాన్ పురస్కారాన్ని అందజేసింది. 2006 లో ప్రఖ్యాత సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్ నిర్వహించిన ఎన్నికల్లో చిరంజీవి టాలీవుడ్ లో అందరికంటే ప్రముఖ సినీ నటుడుగా నిలిచాడు. ఆలా సుమారు 39 ఏళ్ళు తిరుగులేని నటుడిగా తెలుగు చలన చిత్ర రంగాన్ని ఏలాడు చిరంజీవి.

స్వచ్చంధ సేవలు

1998 లో ఆయన, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను కనుగొన్నారు అందులో ఐ మరియు బ్లడ్ బ్యాంకులు ఉంటాయి. రాష్ట్రము లోనే అత్యంత సంఖ్యల్లో రక్తం మరి నేత్ర దానాలు సేకరించి సుమారు 80 వేళా మందికి రక్తం మరియి వేయి మందికి నేత్ర దానం చేసింది ఈ సంస్థ. (CCT) కి, 3 లక్షల 50 వేళా మంది వారి రక్తం, నేత్ర దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసారు. ఇంతవరకు 96000 మందకి ఈ సంస్థ తోడ్పడింది. 2006 లో మన దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలం గారి చేతులమీదుగా చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించారు, దాని ద్వారా పెద్ద ప్రజలకు, అనాధలకు సహాయ చెర్యలు చేసే కార్యక్రమాలు చేపడుతారు.

రాజకీయ వృత్తి

2008 లో చిరంజీవి, ప్రజా రాజ్యం పార్టీ ని స్థాపించారు. 2009 ఎన్నికల్లో పి.ఆర్.పి 18 సీట్లు సంపాదించింది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి ఎం.ఎల్.ఏ గా పోటీ చేసి తిరుపతిలో గెలిచారు. ఫిబ్రవరి 6 2011 లో చిరంజీవి తన పార్టీ ని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసారు. తరువాత 2012 లో కాంగ్రెస్ పార్క్ తరుపున రాజ్యసభ మెంబెర్ గా ఎన్నికయ్యారు. పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సేవలందిస్తున్నారు.

Source: wikipediaTags : Megastar, Chiranjeevi, Chiranjeevi Biography, Chiranjeevi Political CareerOther Biographies