అల్లు అర్జున్ బయోగ్రఫీ

అల్లు అర్జున్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. తెలుగు సినిమాల్లో నటుడిగా ప్రసిద్ధి గాంచిన అల్లు అర్జున్, ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ వ్యవస్థాపకులు అల్లు అరవింద్ - నిర్మల కు 1983 ఏప్రిల్ 8న చెన్నై లో జన్మించాడు. బన్నీ గ పిలవబడే అల్లు అర్జున్ ప్రముఖ హాస్య నటుడు అల్లు రామ లింగయ్యకు మనవడు.

నటుడిగా

అల్లు అర్జున్ బాల్య నటుడిగా చిరంజీవి విజేత మరియు డాడీ చిత్రం లో నటించాడు. 2003 లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం లో గంగోత్రి చిత్రం తో తెరంగేట్రం చేసాడు. 2004 లో సుకుమార్ దర్శకత్వం లో నటించిన ఆర్య చిత్రం తో తనకంటూ ఓ మార్క్ సంపాదించాడు. ఆ చిత్రంలో తన నటనకు స్పెషల్ జ్యురి నంది అవార్డు దక్కింది.

2005 లో వి వి వినాయక్ దర్శకత్వంలో నటించిన బన్నీ చిత్రం కమర్షియల్ సక్సస్ అవ్వడం తో పాటు తనకు మాస్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది.

హ్యాపీ, దేశముదురు మరియు పరుగు వంటి చిత్రాలతో తక్కువ సమయంలోనే టాప్ 5 హీరోల్లో ఒకరిగా నిలిచాడు.

2009 లో సుకుమార్ దర్శకత్వంలో నటించిన ఆర్య 2 చిత్రంతో బన్నీ కి స్టైలిష్ స్టార్ అనే బిరుదు దక్కింది.

తెలుగు సినిమాల్లో తన నటనకు గాను 2 నంది మరియు 5 ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకుని ప్రముఖ టోల్లోవూడ్ నటుడిగా నిలిచాడు.

బఫెల్లో నైట్ వింగ్స్ అనే సంస్థ తో చేరి 800 జూబిలీ అనే నైట్ క్లబ్, అంతర్జాతీయ బేకరీ సంస్థ కేఫ్ కేనోలీ మరియు ఇతర బుసినెస్స్లు బన్నీ నడుపుతున్నారు.

వైవాహిక జీవితం

మార్చ్ 6 2011 లో అల్లు అర్జున్, ఎస్.ఐ.టి కాలేజీ చైర్మన్ సి.కే శేఖర్ రెడ్డి కూతురు,ఆ కాలేజీ మ్యాగ్జిన్ స్పెక్ట్రమ్ చీఫ్ ఎడిటర్ స్నేహ రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు అయాన్ ఒక పాప ఆర్హ.

Source: wikipediaTags : Allu Arjun, Allu Arjun Biography, Allu Arjun MarriageOther Biographies